వ‌చ్చేవార‌మే విరాట్-అనుష్కల పెళ్లి?

viratkohli-anushka
virat kohli-anushka

ఢిల్లీః టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఎట్టకేలకు ఒక ఇంటివాళ్లు అవుతున్నారట. వీరిద్ద‌రూ వ‌చ్చేవారం ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు తెలిసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం డిసెంబర్ 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో వీరి పెళ్లి వేడుక జరుగనున్నట్లు సమాచారం. దీనికోస‌మే డిసెంబర్ 10 నుంచి విరాట్ శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 మ్యాచ్‌ల నుంచి విరామం విరాట్ విరామం తీసుకున్నాడని, అనుష్క కూడా ఆ సమయంలో సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గుట్టచప్పుడు కాకుండా ఈ వేడుక జరుగాలని విరాట్, అనుష్క భావిస్తున్నారట. ఇందుకోసం ఇద్దరి కుటుంబసభ్యులు, సన్నిహితులు మినహా వేరే ఎవరిని వివాహానికి ఆహ్వానించడంలేదని తెలుస్తోంది. అయితే ఈ వివాహం కోసం ఇప్పటికే ఇద్దరి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. విరాట్ సహచర క్రికెటర్లు, ఇతర స్నేహితుల కోసం ఈ నెల 21న ప్రత్యేకంగా ఢిల్లీలో ఓ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిసింది.