వ్వవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

KTR
KTR

తంగళ్లపల్లి: ఎన్నికల ప్రచారం ఈరోజు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కెటిఆర్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు మహాకూటమికి ఓటేస్తే మళ్లీ వెనుకటిరోజులే వస్తాయని ఆయన అన్నారు. వ్వవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కోన్నారు.67 ఏళ్లలో ఏం చేయని వారు తమ ప్రభుత్వ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ట్రల్లో అభివృద్ధి చేయని కాంగ్రెస్‌ ఇక్కడ చేస్తామనడం హాస్యాస్పమని కెటిఆర్‌ ఎద్దేవా చేశారు.