వ్య‌వ‌సాయాన్ని వ్యాపారంగా చేసిన‌పుడే వృద్ధి సాధ్యంః బిల్‌గేట్స్‌

bill gates
bill gates

విశాఖ‌ప‌ట్ట‌ణంః ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తు రైతుల‌పై ఆధార‌ప‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పారని మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ అన్నారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన అగ్రిటెక్ స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో పాల్గొన్న బిల్‌గేట్స్ మాట్లాడుతూ… వ్య‌వ‌సాయ రంగంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు రావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌సాయంలో టెక్నాల‌జీని వినియోగించుకుని ఏపీ ముందుకు వ‌చ్చింద‌ని తెలిపారు. భార‌త్ లాంటి దేశంలో చిన్న‌, స‌న్న‌కారు రైతులే అధికంగా ఉన్నారని బిల్‌గేట్స్ చెప్పారు. వ్య‌వసాయాన్ని వ్యాపారంగా చేసిన‌ప్పుడే వృద్ధి సాధ్యం అవుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌సాయ రంగంలో మ‌రింత సాంకేతిక‌త ఉప‌యోగించాలని చెప్పారు.