వ్య‌భిచార ముఠా గుట్టు ర‌ట్టు

B N
B N

కర్నూలు : స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్‌ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యులముఠా గుట్టును షీ-టీమ్స్‌ రట్టు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. నెలకోసారి కాలనీలు మారుస్తూ గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారి ఫొటోలను విటులకు వాట్సాప్‌ల ద్వారా పంపించి రహస్యంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.