వైస్సార్సీపీ లో చేరి తప్పు చేశా.. క్షమించాలంటూ పరిటాల సునీత కాళ్లపై పడిన కార్యకర్త

వైస్సార్సీపీ లో చేరి తప్పు చేశా.. క్షమించాలంటూ ఓ కార్యకర్త పరిటాల సునీత కాళ్లపై పడిన ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో జరిగింది. ఆదివారం గ్రామంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు సునీత కాళ్లపై పడి తనను క్షమించాలని వేడుకున్నాడు.

టీడీపీని కాదని తాను వైస్సార్సీపీ లో చేరి తప్పుచేశానని, తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డాడు. రామాంజనేయులను పైకి లేపిన సునీత.. మీలాంటి వారికి పార్టీలో ఎప్పటికీ స్థానం ఉంటుందంటూ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే కాదు చాల గ్రామాల్లో గత ఎన్నికల సమయంలో టీడీపీ ని విడి , వైస్సార్సీపీ లో చేరిన నేతలు , కార్యకర్తలు మళ్లీ సొంత గూటికే వస్తున్నారు.