వైరల్‌గా మారిన ధోనీ డాన్స్‌ వీడియో

Dhoni1
Dhoni

వైరల్‌గా మారిన ధోనీ డాన్స్‌ వీడియో

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ -10 సీజన్‌ ప్రారంభానికి ముందు రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ ప్రస్తుతం జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతు న్నాడు. ధోని తన సహచర ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.ధోని తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.ఈ వీడియోలో ధోని,అజింక్యా రహానే కలిసి డ్యాన్స్‌చేస్తుండగా పుణే జట్టులో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వెనున నిల్చుని ఎంజా§్‌ు చేస్తున్నాడు.ఈ వీడియోను పోస్టు చేసిన 12 గంటల్లోనే 7.50 లక్షల వ్యూస్‌, 4400 కామెంట్లు వచ్చాయి.ఇదే వీడియోని అజింక్యా రహానే తన పేస్‌ బుక్‌ ద్వారా షేర్‌ చేశాడు.2008 ఐపిఎల్‌ ఆరంభమయ్యాక 2015 వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని బాధ్యతలు నిర్వర్తించాడు.ఐపిఎల్‌ నుంచి చెన్నై జట్టుపై నిషేదం విధించిన తరువాత గత సీజన్‌లో పుణే కెప్టెన్‌గా ధోని నియమితు డయ్యాడు. అయితే ఐపిఎల్‌ -10వ సీజన్‌ ప్రారంభానికి ముందు ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా సాధారణ ఆటగాడిగా ధోని ఆడుతున్న తొలి ఐపిఎల్‌ ఇదే కావడం విశేషం.