వైద్య సుభాషితాలు

 

RAJASTANI FOOD

వైద్య సుభాషితాలు

తిన్న వెంటనే నిద్రపోకూడదనీ, కఫ పిత్తప్రకోపం కలిగి జఠరాగ్ని మందమైపోతుందని, తిన్న తర్వాత ఓ వంద అడుగులైనా వేయాలని వైద్యశాస్త్రం చెబుతోంది.

ఆయా బుతువుల్లో ఆహారం, అలవాట్లు తెలుసుకుని పాటించాలి.

విడివక్కలు నమలడం హానికరం. తమలపాకులతో చేర్చి సుగంధ ద్రవ్యాలను కర్పూరం, జాపత్రి, ఇలాచి, లవంగాలతో సున్నం చేర్చి తాంబూలాన్ని తీసుకుని తింటే జీర్ణశక్తిని కలిగిస్తుంది.

మన ఆరోగ్యం నిమిత్తం తిథి, వార, నక్షత్ర నియమాలను ఏర్పాటు చేసారు. జఠరాగ్ని నాభికి ఎడమ వైపున ఉంటుంది. కనుక జీర్ణం అయ్యేవరకూ (అన్నం) ఎడమవైపుకు తిరిగి పడుకోవాలని వైద్యగ్రంధాలు చెపుతున్నాయి.

మంచంలో పడక త్రిదోషాలను పోగొడుతుంది. కర్రతో చేసిన బల్ల వాతాన్ని పోగొడుతుంది.
దూదిపరుపుతో కూడిన మంచం వాత కఫాలను పోగొడుతుంది.
తలపాగా ధరించడం జుట్టుకు మంచిది.
పాలతో అన్నం, వేడినీటితో స్నానం శరీరానికి బలాన్ని ఇస్తాయి. ప్రతీరోజూ అల్లం, శొంఠి, జీలకర్ర, తేనె, కరివేపాకు వాడటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది.

కాలి బొటనవేలుకు రాగి ఉంగరాన్ని కడితే తీవ్రమైన తలనొప్పి తగ్గుతుంది.

భోజనానికి ముందు, మధ్యలో అయినా తరువాతయినా అరటి పండు తినకూడదు.
పాయసం తిన్న తరువాత పెరుగుతో అన్నం తినకూడదు. మజ్జిగ అన్నంలో అరటిపండు కలిపి తినకూడదు.

రాత్రి పెరుగు తినకూడదు. ఒకవేళ వాడవలసి వస్తే పెరుగు, పంచదార, నెయ్యి కలిపి వాడాలి. అలాగైతే వాతాన్ని పోగొడుతుందని చరకశాస్త్రంలో ఉంది.
రాత్రిల్లు మజ్జిగపులుసు తినకూడదు. త్రయోదశి తిథినాడు వంకాయ వండరాదు, తినరాదు.

అష్టమినాడు కొబ్బరి తినకూడదు. పాడ్యమి తిథినాడు గుమ్మడికాయ కూరను తినకూడదని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది.