వైద్య శిబిరంలో పరీక్షలు

BREAKING NEWS
BREAKING NEWS

విద్యానగర్‌: వాతావరణ మార్పుల నేపధ్యంలో అంటు వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ జోనల్‌ చైర్మన డాక్టర్‌ శ్రీనివాస్‌ గంగాధరి సూచించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్‌ గెలుపును స్వాగతిస్తూ సోమవారం లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌, హెల్త్‌ సిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలన్నారు. లయన్స్‌ రీజనల్‌ చైర్మన్‌ నాగభూషణం, డాక్టర్‌ జి.కె. రమణ, హెల్త్‌సిటీ ప్రెసిడెంట్‌ లయన్‌ రాజు, డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్న ఈ శిబిరంలో వందలాదిమందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.