వైద్యుల నిర్లక్ష్యం ప్రాణం తీసింది..!

Doctor
Doctor

మ‌హ‌బూబ్‌బాద్‌: వైద్యుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కాగా, సోమారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాధితుడికి నర్సులే చికిత్స చేయడంతో చికిత్స వికటించి బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.