వైద్యుడి నిర్వాకం

Doctor
Doctor

వైద్యో నారాయ‌ణ హ‌రిః  వ‌చ‌నానికి క‌ళంకం తెచ్చాడు ఓ వైద్యుడు. చికిత్స కోసం ఒంటరిగా వచ్చిన బాలికపై అత్యాచార దారుణానికి ఒడ‌గ‌ట్టాడు. ఈ ఉదంతం యూపీలోనే జరిగింది. ముజఫర్ నగర్ ప్రాంతంలో గత మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక చికిత్స కోసం క్లినిక్ వెళ్లగా ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమె ఆచూకీ లేదు. అనంతరం మగతగా ఉన్న స్థితిలో ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని జిల్లా ఎస్పీ అజయ్ సహ్ దేవ్ తెలిపారు. వైద్యుడు ఆమెకు మత్తు మందులు ఇచ్చి లైంగిక దారుణానికి పాల్పడినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించారు. నిందితుడైన వైద్యుడ్ని అరెస్ట్ చేశామని, విచారణలో భాగంగా అతడి క్లినిక్ నుంచి అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో మరో దారుణం వెలుగు చూడడం గమనార్హం.