వైద్యకళశాల ఏర్పాటుతో మెరుగైన వైద్యం: మంత్రి హరీష్‌

T. Harish rao
T. Harish rao

సిద్ధిపేట: వైద్యకళశాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.కాగా నేడు ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన వైద్యకళశాల,జనరల్‌ ఆస్పత్రి భవనాలను ప్రారంభించారు. దసరా పండుగ రోజున అడగ్గానే సీఎం కెసిఆర్‌ సిద్ధిపేటకు వైద్యకళశాలను మంజూరు చేశారని తెలిపారు. అందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి హరీష్‌రావు అన్నారు.