వైకుంఠ ఏకాద‌శికి తిరుమ‌ల‌లో భారీగా ఏర్పాట్లు

tirumala
tirumala

తిరుమ‌లః వైకుంఠ ఏకాదశి, ద్వాదశిను పురస్కరించుకొని తిరుమలలో భారీ ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చిన భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి టీటీడీ అధికారులు అనుమతించారు. అలాగే రేపు ఉదయం 5 గంటలకు శ్రీవారి దర్శనం ప్రారంభం కానుంది. వీఐపీలను దర్శనానికి అనుమతించిన అనంతరం ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు. కాగా…39 గంటల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. అలాగే నేటి నుంచి ఐదు రోజులు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. జనవరి 2 వరకు దివ్యదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల జారీ నిలిపివేశారు. 24 గంటల పాటు ఘాట్ రోడ్లలో వాహన రాకపోకలకు అనుమతినిచ్చారు.