వైకాపా తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా నేతల ఫిర్యాదు!

TDP
TDP

నంద్యాల: ఉపఎన్నిక నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ కలకలం
సృష్టిస్తోందని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి సీఎం
ఆహర వాహనంలో రూ.100 కోట్లు తరలిస్తున్నారని వైకాపా తప్పుడు ప్రచారం చేసిందని,ఆ
వాహనాన్ని అందరి సమక్షంలో అధికారులు తనిఖీ చేశారని, వాహనంలో నగదు లేదని అన్నారు.
ముఖ్యమంత్రి ఆహార వాహనంపై నిఘా ఏంటని వారు ప్రశ్నించారు. ఈ అంశం సీఎం భద్రతకే
ముప్పు అని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కుట్ర కోణంలో దర్యాప్తు జరపాలని ఫిర్యాదు
చేశారు.