వైఎస్‌ఆర్‌సిపి రాజీనామాల డ్రామా ప్రజలు అర్ధం చేసుకున్నారు

AP CM
AP CM

జమ్మాదేవినేట: విజయనగరం జిల్లాలో సియం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో సియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోది నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సి యం వ్యాఖ్యానించారు. అంతకు ముందు లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో పర్యటించిన సియం చంద్రబాబు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.