వైఎస్‌ఆర్‌సిపి బహిరంగంగా టిఆర్‌ఎస్‌కు మద్దతు

P ANURADHA
P ANURADHA

విజయవాడ: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి పిచ్చి కూతలు కూస్తున్నారని టిడిపి నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపి ఆత్మ కేసిఆర్‌ ఐతే, అంతరాత్మ కేటిఆర్‌ అని విమర్శించారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరితే జగన్‌ కనీసం గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలకు మిషన్‌ భగీరథ కాంట్రాక్టులు అప్పగించారని ఆమె ఆరొపించారు. వైఎస్‌ఆర్‌సిపి బహిరంగంగా టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందని అంటూ ఆమె అన్నారు.