వైఎస్సార్సీ తీర్థం పుచుకున్న రామారెడ్డి

ysrcp
ysrcp

తూర్పుగోదావరి: అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తేతలి రామారెడ్డి, తన అనుచరులు నేడు వైఎస్సార్సీలో చేరారు. వైఎస్సార్సీ అధినేత జగన్‌ ఆయనకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌ని ముఖ్యమంత్రని చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా రామారెడ్డి మీడియాకి వెల్లడించారు. కాగా, జగన్‌ 212వ ప్రజాసంకల్పయాత్ర జిల్లాలోనే కొనసాగుతోంది.