వైఎస్సార్సీ గూటికి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌?

Kanna Laxminarayana
Kanna Laxminarayana

అమ‌రావ‌తిః ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేయడంతో కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైస్సార్సీ గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. గత కొద్ది కాలంగా ఆయన వైస్సార్సీతో టచ్ లో ఉన్నారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా కొద్ది సేపటి కిందట కన్నా లక్ష్మీనారాయణ కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీంతో ఆయనవైస్సార్సీ గూటికి చేరుతారన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.