వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యేపై టిడిపి ఎమ్మెల్సీ దుర్బాష‌లు

TDP
TDP

నెల్లూరుః వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యేను అధికార టీడీపీ ఎమ్మెల్సీ దూషించిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగునీటిపై వాడివేడి చర్చ జరిగింది. వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి బ్రోకర్ అంటూ.. టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర దూషించడంతో ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా… ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అధికారుల తీరుపై ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆరోపణలు సరికాదంటూ ఇరిగేషన్ అధికారులు ఎదురుతిరిగారు. నీటి పంపిణీలో వివక్షత చూపుతున్నారన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు