వేలానికి హాకింగ్‌ వీల్‌చైర్‌

stephen hawking
stephen hawking

లండన్‌: ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌..వీల్‌ చైర్‌ను, కొన్ని ముఖ్యమైన పత్రాలను వేలం వేయనున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే హాకింగ్‌ కన్నుమూశారు. ఈ ఆన్‌లైన్‌ వేలంలో మొత్తం 22 ఐటమ్స్‌ ఉన్నాయి. క్రిస్టీ సంస్థ ఈ వేలాన్ని ప్రకటించింది. విశ్వం పుట్టుకపై హాకింగ్‌ రాసిన థీసిస్‌ కూడా వేలంలో ఉన్నట్లు క్రిస్టీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. హాకింగ్‌ పేపర్స్‌తో పాటు ఐజాక్‌ న్యూటన్‌ ,చార్లెస్‌ డార్విన్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ పేపర్స్‌ కూడా వేలానికి రానున్నాయి. తొలుత అక్టోబరు 30 వరకు క్రీస్టీ క్లబ్‌లో లక్ష నుంచి లక్షన్నర పౌండ్ల వరకు వేలంలో అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.