వేరుసెనగకు భారీ నష్టం

FLOOD
FLOOD

వేరుసెనగకు భారీ నష్టం

అనంతపురం : గత వారం రోజులుగా ఎడతెరప లేని వర్షాలతో అనం తపురం జిల్లాలో పంట నష్టం,ఆస్థి నష్టం అపారంగా ఉంది.చేతికి వచ్చిన వేరుశనగను మొదట విడత కింద భూమి నుంచి వేరు చేసి కాయలు పీకాలని రైతులు గత కొన్ని రోజులుగా బావించారు.ఐతే ఎడతెరపలేని వర్షాలతో వేరుశనగ కాయలకు మోసలు వస్తున్నాయి. భూమిలోనే కాయలకు మోసలు వస్తుండటంతో రైతు లు ఆందోళనకు గురౌతున్నారు.వర్షాలతో వేరు శనగతో పాటు మొక్కజోన్న,జొన్న తదితర పంటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.