వేములవాడ ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

vemulawada temple
vemulawada temple

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేశారు. పునర్వసు నక్షత్రం మహాన్యాస పూర్వాభిషేకం చేస్తున్నారు. శ్రీసీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.