వేదఘోషతో ప్రతిధ్వనిస్తున్న యాగస్థలి

aayutha chandi yogam

అయుత చండీయాగ శుభారంభ సూచకంగా మంగళవారం ఎర్రవల్లిలో త్రైలోక్య మోహన గౌరీహోమాన్ని నిర్వహించారు. రుగ్వేద జ్యోతిష్య విద్వాంసులు విరివింటి ఫణిశశాంకశర్మ ఈ హోమాన్ని జరిపించారు. అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతి.. ఆదిత్యాజ్జ్యాయతే వృష్టిః వృష్టేరన్నంతతః ప్రజాః అంటూ ప్రపంచమానవాళికి సకల శుభాలు కలిగేలా అగ్నిదేవుడి సాక్షిగా హోమద్రవ్యాలన్నీ సూర్యభగవానుడికి చేరాలని, సూర్యుడు ప్రకృతివరాలను అందించాలనే రుగ్వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా వేదపండితులు మహాసంకల్పాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానయజ్ఞవాటిక నూట ఆరు హోమగుండాలతో, అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులతో సర్వాంగసుందరంగా సిద్ధమయ్యింది.