వెల్దుర్తి నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర‌

YS Jagan
YS Jagan

క‌ర్నూలుః ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం కర్నూలు జిల్లాలోని వెల్ధుర్తి నుంచి ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… శుక్రవారం సీబీఐ కోర్టుకు హజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ రావడంతో పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు. శనివారం ఉదయం మళ్ళీ ఆయన వెల్దుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. చెరుకులపాడు, క్రిష్ణగిరి మీదుగా రామకృష్ణాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది.