వెయ్యి కోట్లు కేటాయింపు

Rajnath Singh

ఎపి, తెలంగాణ సహా నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాలకు
వెయ్యి కోట్లు కేటాయింపు
ఢిల్లీ : నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని హోం మంత్రి రాజనాధ్‌సింగ్‌ వెల్లడిస్తూ దేశంలోని 7 రాష్ట్రాల్లో 35 నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు ఉన్నాయని, ఆయా జిల్లాల్లో అభివృద్ధి, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. అలాగే జార్ఘండ్‌లో 16 జిల్లాలు, చతీస్‌ఘడ్‌లో 8, బీహార్‌లో 6, ఒడిశాలో 2, మహరాష్ట్ర, ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కొక్క జిల్లా చొప్పున నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్లు వివరించారు. ఒక్కొక్క జిల్లాకు 28.57 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామన్నారు.