వెనుకబడిన కులాల వారికి అండగా ఉంటాం

PAWAN
PAWAN

హైదరాబాద్‌: శెట్టిబలిజలతోపాటు, వెనుకబడిన కులాల వారికి తాను అండగా ఉంటానని జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజకు జనసేన పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ సమన్వయకర్త పితాని బాలకృష్ణ జనసేన పార్టీలో చేరనున్న దృష్ట్యా సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో పర్యటన సమయంలో తమ పార్టీలో బాలకృష్ణ చేరుతారని ప్రకటించారు. గతంలో ఆయన పోలీస్‌ శాఖలో ఉద్యోగిగా పనిచేశారని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ను కలిసిన వారిలో పితాని బాలకృష్ణతోపాటు, కొప్పిశెట్టి బాలకృష్ణ, గుత్తుల వెంకటేశ్వరావు, సానబోయిన వీరభద్రరావు తదితరులు ఉన్నారు.