వెండితెరపై అంజలి సోదరి ఆరాధ్య

AARADHYA
AARADHYA

వెండితెరపై అంజలి సోదరి ఆరాధ్య

కథానాయికల చెల్లెళ్లు.. వెండితెరపై అడుగుపెట్టటం, తమ సత్తా చాటుకోవటం చూస్తూనే ఉన్నాం.. ఆ జాబితాలో మరో అమ్మాయి చేరింది. తనే అంజలి సోదరి.. ఆరాధ్య, తానుకూడ అక్కలా వెండి తెరపై రాణిస్తానని ధీమాగా చెబుతోంది.. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది ఆరాధ్య.. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం.. నీళ్లు బాగుంటాయి..సినిమాల్లోకి వెళ్లొచ్చు కదా? అని సన్నిహితులు చెప్పేవారు.. అక్క అంజలి సినిమాల్లో రాణించింది. తనని స్ఫూర్తిగా తీసుకుని నేనుకూడ అడుగుపెట్టా.. అక్క తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓస్థానం సంపాదించుకుంది.. అదృష్టం అనేదానికంటే. అక్కడ పడి కష్టమే.. తన ఉన్నతికి కారణం.. మా అమ్మ కూడ తనకి బాగా సపోర్ట్‌ చేసింది.. అమ్మ సహకారం ఉంటుందన్న ధైర్యంతోనే నేనూ చిత్రసమీలో అడుగుపెట్టా.. చిన్నప్పుడే నృత్యం నేర్చుకునా.. సినిమాకి ఏమేం కావాలో వాటిపై శిక్షణ తీసుకున్నా.. నటిగా నాకు పేరొచ్చే ఎలాంటి పాత్ర అయినా చేస్తా.. పాత్రకు తగ్గట్టుగా కన్పిస్తా.. గ్లామరు, నటన, అనేదానికంటే మంచిపాత్రలు, మంచి కథలే ముఖ్యం.. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్న సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులోనూ ఓ సినిమా చేస్తున్నా.. ఒకట్రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి .. అంటోంది.. ఆరాధ్యకి ఇష్టమైన నటుడు ఎవరు అని అడిగిఏ. ప్రభాస్‌ అని చెబుతోంది.. బాహుబలి కంటే ముందే ఈశ్వర్‌ సమయం నుంచే ప్రభాస్‌ అభిమానిని అంటోంది.. కథానాయికల విషయానికొస్తే.. జయసుధ గారిని బాగా ఇష్టపడతా.. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ నటి ఆమె అంటోంది..