వెంకీ కూడా పాటేసుకున్నాడు!

VENKI222
VENKI

వెంకీ కూడా పాటేసుకున్నాడు!

 

చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్‌ హీరోలు తమ గొంతుని సవరించుకొని సింగర్‌ గా తమ సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడు మరో సీనియర్‌ హీరో వెంకటేష్‌ కూడా తన సినిమాలో పాట పాడినట్లుగా తెలుస్తోంది. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కించిన గురు సినిమాలో ఆయన బాక్సింగ్‌ కోచ్‌ గా నటిస్తున్నారు. ఆయన శిష్యురాలి పాత్రలో రితికా సింగ్‌ కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. దానికి మంచి స్పందనే లభించింది. అయితే ఈ సినిమాలో యూత్‌ ఫుల్‌ సాంగ్‌ ఒకటి ఉందట. ఆ పాటను వెంకటేష్‌ తో పాడించినట్లుగా తెలుస్తోంది. సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ ఆ పాట రికార్డింగ్‌ ను పూర్తి చేశాడు. ఈ పాట బాగా వచ్చిందని చెబుతున్నారు. మరి ఇప్పటివరకు హీరోగా మెప్పించిన వెంకీ సింగర్‌ గా ఎన్ని మార్కులు సంపాదించుకుంటాడో.. చూడాలి. ఏప్రిల్‌ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. =====