వెంకీ కుడముల డైరెక్షన్‌లో?

NITIN-1
NITIN-1

వెంకీ కుడముల డైరెక్షన్‌లో

హీరో నితిన్‌ ప్రస్తుతం ఛల్‌ మోహన్‌రంగ సినిమా పనులోల బిజీగా ఉన్నారు. ఒకవైపు షూటింగ్‌ చేస్తూనే మరోవైపు కొత్త కథల్ని వింటున్నాడీ హీరో.. సినీవర్గాల్లో కథనం ప్రకారం నితిన్‌ ఒక యువదర్శకుడితోసినిమా చేసే అవకాశాలున్నాయట..ఆ దర్శకుడు మరెవరోకాదు డెబ్యూ చిత్రం ఛలో తో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల.. ఛలో హిట్‌ తర్వాత నిర్మాణ సంస్థల నుంచి వరుస ఆఫర్లు అందుకుంటున్న వెంకీ భిన్నమైన స్టోరీ లైన్‌తో కూడిన కథ నితిన్‌కు చెప్పాలనుకున్నాట.. ఒకవేళ నితిన్‌ కనుక వెంకీ కథకు ఇంప్రెస్‌ అయితే వీరి సినిమా త్వరలోనే పట్టాలెక్కేయొచ్చు. వెంకీ గతంలో నితిన్‌ చేసి అ..ఆ సినిమాకు దర్శకత్వ విభాగంలలో పనిచేసిన సంగతి తెలిసిందే.