వెంకటాపురం ట్రైలర్‌ విడుదల!

VENKATAPURAM.
VENKATAPURAM.

వెంకటాపురం ట్రైలర్‌ విడుదల!

రాహుల్‌, మహిమా మక్‌వానా హీరో హీరోయిన్స్‌గా గుడ్‌ సినిమా గ్రూప్‌, బాహుమన్య ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై వేణు మడికంటి దర్శకత్వంలో శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం వెంకటాపురం. ఈ సినిమా ట్రైలర్‌ ను గురువారం హైదరాబాద్‌ లో అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా..
అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. సినిమాలు సక్సెస్‌ అవ్వడం ఇండwస్టీకు అవసరం. ఎంతో కష్టపడి తక్కువ బడ్జెట్‌ లో సినిమా చేస్తూ.. ఎందరినో ప్రోత్సహిస్తున్నారు. నాలుగు చిన్న సినిమాలు చేసి లాభం సంపాదించాడు చిత్ర నిర్మాత. ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. చిన్న సినిమాకు కావాల్సింది అందరూ కలిసి ప్రాణం పెట్టి సినిమా చేయడం. అలా ప్రేమతో చేసే సినిమాకు ఖచ్చితంగా హిట్‌ అవుతాయి అన్నారు.
దర్శకుడు వేణు మాట్లాడుతూ.. ఇది కమర్షియల్‌ సినిమా కాదు.. కాన్సెప్ట్‌ ఉన్న సినిమా. కథను నమ్మి నిర్మాతలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఫిబ్రవరి చివర్లో లేదొ.. మర్చి మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేస్తాం. రాహుల్‌ కు ఈ సినిమా హిట్‌ అవడం ఎంత ముఖ్యమో.. నాకు కూడా అంతే ముఖ్యం అన్నారు.
రాహుల్‌ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ గారితో మూడేళ్ళుగా ట్రావెల్‌ చేస్తున్నాం. నిర్మాతలు మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.అలాగే దర్శకుడు మంచి కథతో ఈ సినిమాను రూపొందించారు. మంచి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు వెన్నెముక అన్నారు.