వెంకటాద్రిలో దుండగుల లూటీ

VENKATADRI EXPRESS
VENKATADRI EXPRESS

పెద్దపప్పూర్‌: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో తిరుపతి-కాచిగూడ వెంకట్రాది ఎక్స్‌ ప్రెస్‌లో దుండగులు లూటీ చేశారు. జూటూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం అర్థరాత్రి దుండగులు సిగ్నల్‌ వైర్లు కత్తిరించడంతో రైలు ఆగిపోయింది. ఆ సమయంలో రైలు ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి బీభత్సం సృష్టించి, దోపిడీకీ పాల్పడ్డారు. అంతేకాకుండా దొంగలు ఎస్‌5, ఎస్‌6, బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికుల నుంచి రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. దాంతో బాధితులు కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.