వీరమరణం పొందిన భారత వీర జవాన్లకు అశ్రు నివాళి తెలిపిన సిపిఐ


సైఫాబాద్‌: పాకిస్తాన్‌ ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, వీర మరణం పొందిన భారత వీర జవాన్లుకు శుక్రవారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌ వద్దగల డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాం ఎదుట ఆనేక మంది సిపిఐ కార్యకర్తలు కోవ్వోత్తులతో అశ్రు నివాళి అర్పించారు. సిపిఐ హైదరాబాద్‌ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనేక మంది సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ ప్రసంగిస్తూ 44 మంది జవాన్లును పోట్టపెట్టుకున్న పాకీస్తాన్‌ ఉగ్రవాదులను తుదిముట్టించేకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యుద్ధంలో పాల్గొనేందుకు సిపిఐ కార్యకర్తలతోపాటు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని విడగోట్టడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాదులు దొంగదాడులకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన నిశితంగా విమర్శించారు. ఉగ్రవాదుల చర్యలను ఎదుర్కొనడానికి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతోపాటు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు ముందుకు రావాలని ఇ.టి.నరసింహ పిలుపునిచ్చారు. ధైర్య సాహసాలతో రాత్రి భవళ్ళు దేశంలోని కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడానికి కాపాలా కాస్తున్న సైనికుల సేవలు మరువలేనివని, వీర మరణం పొందిన అమర జవాన్లుకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిఘా లోపం వల్లనే ఉగ్రవాదులు తరుచూ మన సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారిపైన ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. భారత మాత ముద్దుబిడ్డలైన వీర జవాన్ల మృతి పట్ల యావత్‌భారత్‌ జాతి తీవ్ర ఆందోళనలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రేమ్‌పావని, ఎస్‌.ఛాయాదేవి, గెల్వయ్య, రాజేందర్‌, సత్యనారాయణ, మన్నన్‌, హరినాధ్‌గౌడ్‌, రాకెష్‌సింగ్‌, నెర్లకంటి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
                                                బషీర్‌బాగ్‌లో పాకీస్తాన్‌ ఉగ్రవాదుల దిష్టిబోమ్మ దగ్ధం
దశాబ్ధాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకీస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పాలని బిజెపి యువ మోర్చ నగర అధ్యక్షుడు ఎ.విన§్‌ుకుమార్‌ డిమాండ్‌ చేశారు. జమ్మూకాశ్మీర్‌లో 44 మంది భారత జవాన్లపై ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి చేసి చంపడం పిరికిపంద చర్యని ఆయన అన్నారు. శక్రవారం బషీర్‌బాగ్‌లో బిజెవైఎం కార్యకర్తలు పాకీస్తాన్‌ ఉగ్రవాదుల దిష్టిబోమ్మను దగ్ధం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాకీస్తాన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎదురుపడి పోరాడితే ఎవరిసత్తా ఏమిటో తెలుస్తుందని ఆయన సవాల్‌ విసిరారు. ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువమెర్చా నాయకులు శివాజీ, లడ్డు, గోపి, రాజేష్‌, గోవిందరాజు, ఎన్‌.శివ తదితరులు పాల్గొన్నారు.
                                                          వీర జవాన్లుకు నివాళి తెలిపిన లోక్‌దళ్‌
పాకీస్తాన్‌ ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన 44 మంది అమర జవాన్లుకు లోక్‌దళ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరాజేశ్వరరావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకీస్తాన్‌ ఉగ్రవాదులను తుదిముటించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఉగ్రవాదుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, భారతదేశం శాంతి సహానాలతో ఉండటం వల్లనే ముష్కరమూకలు దాడులకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.