వీటితో క్యాన్సర్ దూరం

ఆహారం-ఆరోగ్యం

he

ఉల్లి గడ్డలు, అరటి, వెల్లుల్లి వంటి ప్రీబయాటిక్స్ తో క్యాన్సర్ పెరుగుదలను నిరోధించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.. ఎలుకలపై చేసిన ప్రయోగంలో పై పదార్ధాల కారణంగా ప్రీబయాటిక్స్ వలన వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం అయిన విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.. శరీరంలోని కాన్సర్ కణాల పురోగతిని ఇవి నియంత్రించినట్టు కనుగొన్నారు..

కణితి నిరోధక ఇమ్మ్యూనిటీని పెంచటం ద్వారా ప్రీబయాటిక్స్ కాన్సర్ వృద్ధిని అడ్డుకుంటామని తొలిసారిగా పై పదార్ధాలను చేర్చుకోవటం వలన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వారు అంటున్నారు.. ఇక ప్రీబయాటిక్స్ జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియాకు దోహదకారిగా వుంటాయని ఎముకల బలం పుంజుకునేందుకు అనుకూలంగానూ పనిచేస్తాయని కూడా అంటున్నారు.

మరిన్ని ఆరోగ్య విషయాలు, జాగ్రత్తలకు ‘స్వస్థ’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health/