విస్తారా హోలీ ఆఫర్‌

VISTARA
VISTARA

విస్తారా హోలీ ఆఫర్‌

ముంబై: టాటాగ్రూప్‌ ఎయిర్‌లైన్స్‌ విస్తారా హోలీ సేల్‌ ఆఫర్‌ ప్రకటించింది. రూ.999 లకే దేశీయ రూట్లలో అందిస్తోంది. విస్తారా హోలి ఆఫర్‌ ఈనెల పదవ తేదీనుంచి 15వ తేదీ అర్ధరాత్రివరకూ బుక్‌చేసుకోవచ్చు. 21 రోజుల అడ్వాన్సు కొనుగోళ్లు అవసరం అవుతా యి. గోవా, పోర్టుబ్లయర్‌, లేహ్‌, జమ్ము, శ్రీనగర్‌, కోచి, గౌహతి, అమృత్‌సర్‌, భువనేశ్వర్‌ వంటి మెట్రోనగరాలతోపాటు ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తారా నెట్‌వర్క్‌లో ఈ ఆఫర్లు వినియోగించు కోవచ్చు. గౌహతి భువనేశ్వర్‌ రూ.999కే ప్రయా ణించే వీలుంటుంది. జమ్ముశ్రీనగర్‌కు రూ. 1199, ఢిల్లీ లక్నోకు 1549, ఇతర రూట్లలో కూడా ఢిల్లీముంబై 2299, ఢిల్లీ కోల్‌కత్తా 2699లకే ప్రయాణించే వీలుంటుంది. మొత్తం 19 కేంద్రాలకు 500 వరకూ వారంవారం విమా న సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 13 విమా నాలు నడుపుతోంది. ఇతర క్యారియర్లు కూడా ఆఫర్లు ప్రకటించాయి. ఎయిర్‌ఏసియా ఇండియా రూ.1499కే ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్లకు అదనపు విమాన సర్వీసులు కూడా నడుపుతు న్నట్లు కొన్ని దేశీయసంస్థలు ప్రకటించాయి. డిస్కౌంట్‌ ఆఫర్లతో వివిధ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు పోటీ పడుతున్నందున ప్రతి ఏటా ప్యాసింజర్‌ రాక పోకలు 25శాతం చొప్పున వృద్ధి చెందుతున్నాయి.