విస్తరిస్తున్న వ్యాధులు

ప్రజావాక్కు
              విస్తరిస్తున్న వ్యాధులు

seasonal diseases
seasonal diseases

విస్తరిస్తున్న వ్యాధులు
తెలంగాణ రాష్ట్రంలో శ్వాస సంబంధ సమస్యలు ఇటీవలి కాలంలోవిజృంభిస్తున్నాయి.వాతావరణంలో కాలుష్యంస్థాయి, అనూహ్యమార్పులు, చలిగాలుల తీవ్రత పెరగడంతో నైన సైటిస్‌, నిమోనియా, అస్థమా, స్వైన్‌ఫ్లూ తదితర శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్న బాధితులసంఖ్య విపరీతంగా పెరు గుతోంది.గత నెల రోజులలో రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రోగస్థుల సంఖ్య దాదాపుగా ఆరులక్షల దాకా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు తెలి యచేస్తున్నాయి. పట్టణాలలో తప్పిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి వ్యాధులకు ప్రాథమికస్థాయిలో కూడా చికిత్స లభిం చక రోగులు తీవ్రఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. ఇకమహిళ లు, వృద్ధులు, చిన్న పిల్లల సంగతి చెప్పనవసరం లేదు. అవకాశం అదనుగా ప్రైవేట్‌ క్లీనిక్‌లు రోగుల నుండి వేలాది రూపాయలు టీట్ర్‌మెంట్‌ రూపంలో గుంజేస్తున్నాయి.
– సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

మాతృభాష పట్ల అనాదరణ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ పరిపాలనను 80 శాతం ఆంగ్లభాషలోనే నిర్వహిస్తుండటం బాధాకరం. దీంతో దేశంలో అన్ని ప్రాంతీయ భాషలకు శాపంగా మారింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషాభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా నేటికీ కూడా మండల స్థాయిలో అధికారులు ఆంగ్లభాషలోనే దరఖాస్తులు తీసుకోవడం, సర్క్యులర్లు ఇవ్వడం,ఆర్డర్లుపాస్‌ చేయడం చేస్తు న్నారు. పాలన భాషే ఆంగ్లం కావడం, ప్రభుత్వాలు సైతం మాతృభాష పట్ల అనాదరణ కనబరచడం ఇత్యాది కారణాల వలన ప్రజలకు సహజంగానే ఆంగ్లభాష పట్ల మోజు, మాతృ భాషపట్ల చులకనభావం ఏర్పడుతోంది. -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్ల్లా

రాజకీయ పక్షాలు స్పందించాలి!
రాష్ట్ర విభజనతో రాష్ట్రానికి కేంద్రం ఇవ్వవలసిన నిధుల విష యంలో ప్రజాస్వామ్య పీఠం న్యాయనిపుణుల సంఘం వాస్త వాలను తెలియచేసిన నేపథ్యంలో నిధులను రాబట్టడానికి రాష్ట్రంలో రాజకీయ పక్షాలన్నీ ఐక్యపోరాటం చేయాల్సి ఉంది. విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏవిధంగా నష్టపోతున్నదీ నిపు ణుల సంఘం విపులంగా చెప్పింది. ఇక రాజకీయ పక్షాలు ముఖ్యంగా రాష్ట్ర బిజెపి నేతలు తమ కర్తవ్యం ఏమిటో సమీ క్షించుకోవాలి.
– గరిమెళ్ల రామకృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా

ప్రవాస భారతీయులను గౌరవిద్దాం
విదేశాలలో మన భారతీయులు అన్ని రంగాలలో రాణిస్తు న్నారు.శాస్త్రవేత్తలుగా,ఆర్థికవేత్తలుగా రాజకీయవేత్తలుగా కీర్తిగడి స్తున్నారు. పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను పరిరక్షిస్తున్నారు. దేశ పేరుప్రఖ్యాతులు కాపాడుతున్నారు. ప్రతి యేటా దేశం నుండి వివిధ దేశాలకు లక్షలాది మంది యువత చదువ్ఞ, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. వారుసంపాదించిన మొత్తాన్ని సైతం మన దేశంలోని వారు పుట్టిపెరిగిన గ్రామాల అభివృద్ధికి తోట్పాటునందిస్తున్నారు. పేరుకు విదేశాలకు వెళ్లినా నిత్యం వారి ఆలోచనలు మనదేశం చుట్టే తిరుగుతున్నాయి.
-కామిడి సతీష్‌రెడ్డి, భూపాలపల్లిజిల్లా

పంచాయతీ ఎన్నికలు
ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్‌ ఎన్నికలకు సంబం ధించి షెడ్యూల్‌ విడుదలచేసింది.అయితే ఈ ఎన్నికలు మూడు విడతలలో నిర్వహించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే రెండో విడత పోలింగ్‌ తేదీని జనవరి 25న ఉంది. అదే రోజు కౌటింగ్‌, ఉపసర్పంచ్‌ ఎన్నిక అయ్యేవరకు ఏ అర్థ రాత్రో అవ్ఞతుంది. ఎన్నికల విధులు అయిపోయాక ఉద్యోగులు ఇంటికి చేరేటప్పటికీ మరుసటి రోజు వస్తుంది. ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగులు గణతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరుకావడం చాలాకష్టం. ఈ ఎన్నికల విధులకు ఎక్కు వగా ఉపాధ్యాయులును తీసుకుంటున్నారు. జనవరి 25న పోలిం గ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి పునరాలోచించాలి.
-షేక్‌ అస్లాంషరీఫ్‌, శాంతినగర్‌

వెనుకబడిన తరగతులకే రిజర్వేషన్లు
ఆధిపత్యకులాలు సామాజికంగాను, రాజకీయంగాను శక్తివంతం గా ఉన్నాయి. వారికి ఆర్థిక వెనుకబాటు కారణంతో రిజర్వేషన్స్‌ అమలు చేయడంతగదు.ఇలాంటి చర్యలవలన సామాజి కంగా, రాజకీయంగా, బలంగా ఉన్న ఆధిపత్య కులాలు తరతరాలుగా వివక్షకు, అణచివేతలకు గురవ్ఞతున్న వర్గాలను మరింత అణచి వేతకు గురి చేస్తారు. ఈ రిజర్వేషన్లు ఒక ఉద్యోగాల కోసమే కాదు. అన్ని రకాలవిద్య, ఉద్యోగ, రాజకీయ, వనరులు పంచు కోవడం లాంటి అన్నిటిలోనూ ఉంటుంది. ఆర్థి కారణంతోనే సామాజిక వెనుకబాటుతనం లేకుండా రిజర్వేషన్లు పొందడం తగదు.పేదరికాన్ని రూపుమాపి ఆయా ఆధిపత్య కులాలకు చేయూతనివ్వాలనుకుంటే ప్రైవేటీకరణను తగ్గించాలి.
-వాసిలి సురేష్‌, నెల్లూరు