విస్తరిస్తున్న విషజ్వరాలు

Patients in Hyderbad Hospitals
హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రిలోచికిత్సపొందుతున్న జ్వరపీడితులు

విస్తరిస్తున్న విషజ్వరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా విజృంభించిన విషజ్వరాల బారినపడి వేలాదిమంది అల్లాడు తున్నారు. డెంగ్యూ, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ తదితర విషజ్వారాలతో బాటు మలేరియా, డయేరియా ఒకటేమిటి అన్నిరకాల వ్యాధులు ప్రజా రోగ్యంపై దాడి చేస్తున్నాయి. ఈ విషజ్వరాల బారిన పడి కొందరు అసు వ్ఞలు బాస్తుండగా, మరెందరో ఆసు పత్రిపాల వ్ఞతున్నారు. ఇంతటి తీవ్ర పరిస్థితి గతంలో ఎదురొన్న దాఖలాలు లేవని డాక్లర్లే చెబుతున్నారు.

హైదరా బాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి దగ్గు, జ్వరం రకరకాల వ్యాధులతో వస్తున్న రోగుల సంఖ్య పెరిగిపోయింది. బెడ్లు లేకపో వడంతో నేలమీదనో బయట వరండాల్లోనూ, చివరకు ఆవరణలోని చెట్లకింద కూడా పడుకోపెట్టవలసి వస్తోంది. రోగులను పరీక్షించే సమయాన్ని కూడా రెండు గంటలకు పైగా పెంచారు. అటు ఉస్మానియా, ఇటు గాంధీ ఆసుపత్రికి కూడా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ వ్యాధులతోపాటు కేన్సర్‌, ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ప్రబలిపోతున్నాయి. ప్రధానంగా వాయుకాలుష్యం, నీటికాలుష్యంతో పాటు అన్నిటికంటే మించి ప్రజా ఆహారంలో విస్తృతంగా జరు గుతున్న కల్తీ మూలంగా ఈ వ్యాధులు అదుపులేకుండా పెరుగుతున్నాయని డాక్టర్లే చెబుతున్నారు. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నో కొత్త మందులు కనుగొంటు న్నామని చెప్పుకుంటన్న మానవ్ఞని మేధాశక్తిని సవాలు చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త జబ్బులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

సీజన్‌ మారినప్పుడల్లా విజృంభిస్తున్న దోమలు, వాటివల్ల ప్రబలే రోగాలు, మరణాలు రాజ కీయ వివాదాలకు వాడుకుంటున్నారే తప్ప పరిష్కరించే ప్రయ త్నాలు జరగడం లేదు. ఈ వ్యాధులు సోకిన లక్ష్మీప్రసన్నుల సంగతి ఎలా ఉన్నా, మధ్యతరగతి ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడని కూలీలు, చిన్నాచితకా వ్యాపారంపై జీవనం సాగించే వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఒకటి రెండు రోజులుకాదు వారాలు తరబడి నెలల తరబడి మంచాన్ని వదలలేకపోతున్నారు. చికు న్‌గున్యాలాంటి వ్యాధులు సోకినవారైతే కొన్ని రోజులు కాలకృత్యాలు మరొకరి సహాయం లేకుండా తీర్చు కోలేకపోతున్నారు. గత ఏడాది కొద్దిగా తగ్గినా ఈసారి చాలా ప్రాంతాల్లో సోకినట్లు అనధికార సమాచారం.

వాస్తవంగా ఈ చికున్‌గున్యా ఇప్పటికిప్పుడు పుట్టు కొచ్చింది కాదు. మొట్టమొదటి సారిగా 1953లో టాంజానియాలో దీన్ని కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 1955లో కలకత్తాలో కనిపించింది. తిరిగి 1962లో కేరళ, తమిళనాడులో వ్యాపించి ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా కనిపించింది. ఈడిసి ఈజిప్ట్‌ అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి సోకుతోందని, ఈ దోమ మురుగునీటిలో కాకుండా మంచి నీటిలో కూడా విజృంభిస్తోందని, పగలు మాత్రమే సంచరి స్తోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేస్తున్నారే తప్ప ఈ వ్యాధి సోకకుండా నివారించలేకపోతున్నారు. అందుకు అవసరమైన మందులు కూడా కనుగొనలేదనే వాదనలు వినిపిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం పతనం అంచుకు చేరుకున్నదనే చెప్పొచ్చు. పెద్ద పెద్ద రోగాల సంగతి అటుంచి, చిన్న వ్యాధులకు వాడే సూదిమందు, మందు బిళ్లలు కూడా గ్రామీణ ప్రాంతంలోని వైద్య శాలల్లో దొరకడం లేదు. అవసరమైన మేరకు సిబ్బంది లేరు. ఉన్న డాక్టర్లు సక్రమంగా సకాలంలో విధులకు హాజరుకావడంలేదు. సమీక్షలులేవ్ఞ. పర్యవేక్షణలు లేవు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదులో సమావేశాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు ఇచ్చినా అమలుకావడంలేదు. అసలు నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, ప్రజారోగ్య విష యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలలో పాలకులు విఫలమవ్ఞతున్నారనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాంల్లో గిరిపుత్రులు ఈ రోగాలతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావ్ఞ. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాలకులు నంద్యాల ఉపఎన్నికల్లో మునిగి తేలు తున్నారు. అసలు ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ప్రబలు తున్నాయనే స్పష్టమైన సమాచారం సేకరించే వారు కూడా కరువయ్యారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వారికి సోకుతున్న వ్యాధులు గురించి వివరాలు సేకరించి కొన్ని మందులు కూడా ఇచ్చేవారు.

ప్రస్తుతం ఆ కార్యక్రమాలు ఏమాత్రం జర గడం లేదు. ఉన్నకొద్దిపాటి సిబ్బంది కూడా గ్రామాలకు వెళ్లే పరిస్థి తిలో లేరు. చాలావరకు పట్టణాలకే పరిమితమయ్యే అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్లివస్తున్నారు. అందువల్ల వ్యాధుల తీవ్రత గురించి ప్రభుత్వానికి సమగ్రమై సమా చారం అందకుండా పోతున్నది. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ముప్ఫైవేలమందికి ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఇరవైవేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కంద్రం భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలి. ఇలాంటి ఎన్నో నిబం ధనలు నేటికీ అమలుకావడం లేదు.

ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల సౌకర్యాలు కూడా లేవ్ఞ. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ ఆరోగ్య వసతులు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారనే చెప్పక తప్పదు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. వైద్య ఆరోగ్యశాఖ రోగులకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజనులకు చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. –

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌