విస్తరిస్తున్న అవినీతి

ప్రజావాక్కు
                విస్తరిస్తున్న అవినీతి

Corruption
Corruption

విస్తరిస్తున్న అవినీతి
గతంలో అవినీతిపరులు కొందరే ఉండేవారు. అవినీతి కూడా తక్కువగా జరిగేది. మంత్రులు ఇంకా తక్కువ స్థాయి అధికా రుల వరకే అవినీతి పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలోనే అవినీతి జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి మీదే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని అవినీతికి పాల్పడ్డారంటూ పార్లమెంటు ఉభయ సభలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ టం సభ్యుల కేకలు, అల్లరితో దద్ధరిల్లిపోవడం, ఇక అవినీతి విషయంలో రాష్ట్రాలు,వివిధ పార్టీలవారు ఒకర్ని మించి మరొ కరు అన్నట్టుగాఉంది పరిస్థితి. బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు దేశంలోని చాలామటుకు రాష్ట్రాలు అవినీతిమయమైపోయా యి. పార్టీల నాయకులందరూ గోముఖవ్యాఘ్రూల్లా తయార య్యారు.మొత్తానికి అవినీతిక్యాన్సర్‌ వ్యాధిలా పట్టిపీడిస్తోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. అవినీతి పరుల భరతం పడ తామంటూ అధికారంలోకిరావడం ఆ తరువాతఅలా అన్నవారే అవినీతి కూపంలో నిండాకూరుకుపోవడం జరుగుతోంది. అవి నీతిని అంతం చేయడం మాత్రం ఎవరికి చేతకావడం లేదు.
– ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

సమాజంలో నెలకొన్న అశాంతి
నేటి రాజకీయ పరిణామాలు రణరంగాలుగా గోచరిస్తూ ప్రజలను కూడా అదే మార్గంలో నడిపించేలా ఉన్నాయి. ప్రతి రంగంలో ఏదో ఒక అసంతృప్తి నెలకొని, అసూయలకు దారి తీస్తూ, ద్వేషాలు రగులుకోవడం దురదృష్టకంగా భావించాలి. ప్రతి రంగంలో పోటీలు పెరిగిపోయాయి. ప్రజల జీవితాలపై రాజకీయరంగం ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని మారుతూ చెడును పెంచుతు న్నాయి. అశాంతితో, సంఘర్షణలతో ప్రజలు, పాలకులు సత మతమవడం ఏ రాజ్యానికైనా అరిష్టమే.
– ఆర్‌.కె.హైదరాబాద్‌

తాగునీటిపై శ్రద్ధ చూపాలి
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాగునీటి సరఫరా మీద సం బంధిత ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ చూ పాలి. మిషన్‌ భరీరథ మంచినీళ్లకు సంబంధించిన పైపు లైన్లు అనేక చోట్ల తెగిపోతున్నాయి. గొట్టాల ద్వారా నీళ్ల లీక్‌ అవ్ఞతున్న చోట వర్షం నీరు కలిసిపోతోంది. ప్రజల అనారోగ్యానికి ప్రధాన కారణం ఇదే. ఈ విషయం తెలిసీ ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమే అవ్ఞతుంది.
– కె.రామకృష్ణ,హైదరాబాద్‌

రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణీకుల సంఖ్య, సరుకుల రవాణా, రెవెన్యూపరంగా విజయవాడ నెం.1 స్థానంలో ఉంది. ఇలాంటి డివిజన్‌ను రైల్వేశాఖ సవతి తల్లి ప్రేమతో హల్పింగ్‌ స్టేషన్‌గా మార్చేయడం దారుణం.విజయవాడ నుండి కొత్త రైళ్లు నడిపే విషయంలో దశాబ్దాలుగా తీవ్రఅన్యాయం జరుగుతోంది. గత నాలుగుగేళ్లలో విజయవాడకు ఒక్క కొత్త రైలును కూడా కేటాయించకపోగా, కేంద్రం ప్రకటించిన 18 రైళ్లు కాస్త విజయ వాడ మీదుగా వెళ్లేవి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను కనీసం మూడు, నాలుగు రోజుల పాటైనా నడపాలన్న ప్రజల విజ్ఞప్తులను రైల్వేశాఖ బుట్టదాఖలు చేసేసిం ది. రిజర్వేషన్‌కు మూడు నెలల ముందు ప్రయత్నించినా దొరక డం లేదు. తత్కాల్‌లో కూడా టిక్కెట్లు దొరకడం లేదు.
– ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

గ్రామాల్లో ఆన్‌లైన్‌ విద్య అవసరం
ఆన్‌లైన్‌ విద్యావిధానం కోసం విశాఖలో సకల సౌకర్యాలతో కూడిన ప్రపంచస్థాయి ఈ విద్య ప్రాంగణాన్ని ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆన్‌లైన విద్యలో భారత్‌ వెనుకబడే ఉంది. ఆన్‌లైన్‌ కోర్సులు, క్రెడిట్‌లపై యుజిసి ఎన్నో మార్గదర్శకాలు విడుదల చేసినా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల కారణంగా అమలు కావడం లేదు. కొత్తతరం విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సుల పట్ల ఆసక్తికనబరుస్తున్నా డిజిటల్‌ విద్యలో దేశం తగిన పురోగతి సాధించలేకపోతోంది. అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఈలెర్నింగ్‌ సెంటర్‌లో తగినన్ని అవకాశాలు ఇవ్వాలి.
– సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

మత్తులో తూగుతున్న యువత
మాదకద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మాదకద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత జవసత్వాలు సన్నగిల్లి యవ్వ నంలోనే శారీరకంగా మానసికంగానిర్వీర్యమైపోతున్నారు. దుర్వ్యసనాల బారినపడుతూ యుక్త వయస్సులోనే అనారోగ్యానికి గురవ్ఞతున్నారు. శరీర అంతర్భాగం తూట్లు తూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. కళాశాళల్లో చదివే విద్యార్థుల్లో కూడా చాలా మంది ఈ అలవాటుకు బానిసలవ్ఞతున్నారు. ఈ విషయంలో తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తు చేయిదాటే ప్రమాదం ఉంది.
– వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా