విష్ణు కెరీర్‌కి మైలురాయి

eedo-rakam-aado-rakam
ఈడో రకం ఆడో రకం ఆడియో విడుదలలో మోహన్‌బాబు
హీరో అనేనటుడు కామెడీ చేయటం మామూలు విషయం కాదు.. విష్ణు ఇదివరకు ‘ఢీ’, దేనికైనా రెడీ రౌడీ వంటి విభిన్న చిత్రాల్లో నటించాడు..ఆ మూడు సినిమాల కంటే తను నటిస్తోన్న ‘ఈడో రకం ఆడో రకం’ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది..తన కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు మోహన్‌బాబు అన్నారు. మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌, సొనారిక, హెబ్బాపటేల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నచిత్రం ‘ఈడో రకం- ఆడోరకం . జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు, అనిల్‌ సుంకర నిర్మాత.. ఈసినిమా ఆడియో వేడుక హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరిగింది. మంచు మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ కలిసి బిగ్‌సిడిని ఆవిష్కరించారు. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ, దర్శఖుడు నాగేశ్వరరెడ్డి అంటే చాలా ఇష్టం.. డైమండ్‌రత్నం మంచి రచయిత, నిజానికి ఈ సినిమా రైట్స్‌ మొదట నేనే తీసుకున్నా.. మంచు విష్ణు ఈ సినిమా వేరే కాంబినేషన్‌లో చేయాలనుకున్నాడు.. ఫైనల్‌గా అనిల్‌ సుంకర, నాగేశ్వర రెడ్డిలతో సినిమా చేశాడు.. హీరో అనేవాడు కామెడీ చేయటం మామూలు విషయం కాదన్నారు. ఎవరిమధ్యనైనా బంధాలుండాలి. ఈగో ఉంటేపాతాళానికి వెళ్లిపోతారు అన్నారు. విష్ణు, రాజ్‌తరుణ్‌ కలిసి నటించటం సంతోషంగా ఉందన్నారు. వీరిద్దరూ అలాగే మరో రెండు సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ రకరకాల పాత్రల్లో నటించాడు. తను వెర్సలైట్‌ యాక్టర్‌ అన్నారు.  నాగేశ్వరరెడ్డి మట్లాడుతూ,ఈ సినిమాలో విష్ణు చెప్పే అబద్ధంతో మొదలవుతుంది.. తను చెప్పిన అబద్ధం వలన మిగిలిన వారంతా ఎలా ఇబ్బంది పడ్డారనేది సినిమా అన్నారు. ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్‌ తమ సొంత బ్యానర్‌గా భావించి సినిమా చేశారన్నారు. సాయి కార్తీక్‌ మంచి సంగీతం అందించారని, టైటిల్‌ సాంగ్‌లో నటించిన సునీల్‌కు నా థ్యాంక్స్‌ అని నిర్మాత అనిల్‌ సుంకర అన్నారు. రాజేంప్రసాద్‌గారు సెట్స్‌లో ఉన్నపుడు నాన్నగారు ఉన్నారనిపించేది.. ఆయన నా ఫేవరేట్‌ యాక్టర్‌ అని మంచి విష్ణు అన్నారు. హీరో రాజ్‌తరుణ్‌, సొనారికి, హెబ్బాపటేల్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్‌ తమకు సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరుపోట్ల, బివిఎస్‌ఎస్‌ప్రసాద్‌, సునీల్‌, సుశాంత్‌, నిఖల్‌ తదితరులు పాల్గొన్నారు.