విశ్వ‌న‌గ‌రం దిశ‌గా హైద‌రాబాద్ అడుగులు: మేయర్

bontu rammohan
bontu rammohan

హైద‌రాబాద్ః చార్మినార్ ప్రాంతంలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… విశ్వనగరం విజన్‌తో ముందుకెళ్తున్నామని తెలిపారు. నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. జీహెచ్‌ఎంసీ 100శాతం ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో జీహెచ్‌ఎంసీ ముందుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీ పోస్టులను భర్తి చేస్తామని చెప్పారు. రెండేళ్లలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ప్రజా సౌకర్యాల కల్పనలో జీహెచ్‌ఎంసీకి అవార్డులు వచ్చాయి. రూ.230 కోట్లతో నాలాల ప్రక్షాళన చేపట్టాం. మరికొద్ది రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్‌ఈడీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రూ.43 కోట్లతో ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేస్తామన్నారు. పేదల ఇండ్లలో శుభకార్యాల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.