విశ్వాసలోపం

Shirdi2
Shirdi Sai

విశ్వాసలోపం

విశ్వాసం, ఓర్పు అనే పదాలు సాయిబాబాకే పరిమితం కాదు, సాయి సాహిత్యంలోనే చోటు చేసుకోలేదు. ఇతర మతాల్లోను, ఇతర గురువ్ఞలలోను, ఇతర సాంప్రదాయాలలోను కల్పిస్తాయి. ఇద్దరు గుడ్డివారు యేసుప్రభువ్ఞ వద్దకు వచ్చి ‘దావీదు కుమారుడా! మమ్ములను కరుణింపుము అని దీనంగా ప్రార్థించారు. అప్పుడు యేసుప్రభువ్ఞ ‘నేను ఇది చేయగలనని (గుడ్డితనాన్ని పోగొట్టగలనని) మీరు నమ్ముతున్నారా? అని ప్రశ్నించాడు. వారు ‘నమ్ముచున్నాం ప్రభువా! అని పలికారు. అప్పుడు యేసుప్రభువ్ఞ వారి కన్నులను ముట్టుకుని ‘మీ నమ్మిక చొప్పున (ఫలితం) కలుగుగాక! అని పలుకుతాడు. అప్పుడు ఆ అంధులకు చూపు వచ్చింది. దత్తాత్రేయుని అవతారంగా నృసింహ సరస్వం కీర్తింపబడ్డాడు.

నరహరి అనే ఒక వ్యక్తి కుష్టురోగంతో పీడింపబడుచున్నాడు. నృసింహసరస్వతి వద్దకు ఆర్తితో వచ్చాడు. దీనునిపై కృప చూపుమని ఎంతో ప్రాధేయపడ్డాడు. నాలుగు సంవత్సరాల క్రిందట నరకబడి ఎండిపోయిన మేడికొమ్మను సంగమ మార్గాన పాతి అక్కడ గల అశ్వత్ధమ వృక్షాన్ని పూజించి, మేడికొమ్మకు మూడుపూటల యందు రెండు కళశముల జలంతో అభిషేకం చేయుమని నరహరిని ఆదేశించారు నృసింహ సరస్వతి. నరహరి ఆ సద్గురువ్ఞ మాటపై నమ్మకముంచి సేవించసాగాడు. ఎండిన కొమ్మ పల్లవించి వృక్షంగా మారింది. అతని కుష్ఠువ్యాధి సంపూర్ణంగా తొలగింది. నరసింహ సరస్వతులను స్తుతించాడు.

నమ్మకం ఫలితం అది. విశ్వాసమే కాపాడుతుంది. నృసింహ సరస్వతుల కాలంలోనే నంది అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. అతడు శ్వేత కుష్టుచే బాధపడుతున్నాడు. తన ఇష్టదైవమైన పరమేశ్వరిని ఆరాధించాడు. ఆమె అతనికి స్వన్నంలో సాక్షాత్కరించి, గాణుగాపురంలోని జగద్గురువ్ఞ (నరసింహ సరస్వతి)ను ఆశ్రయింపుమని ఆదేశించింది. తన ఇష్టదైవపు ఆదేశాన్ని కాదనలేక నృసింహ సరస్వతి వద్దకు వెళ్లాడు. ‘నారోగ నివృత్తి చేసేది మానవ్ఞడా? అని సందేహిస్తూనే వెళ్లాడు. నరసింహ సరస్వతికి తన స్వప్న వృత్తాంతం చెప్పాడు నరహరి. సంగమంలో సంకల్ప పూర్వకంగా స్నానం చేసి, అశ్వత్ధ వృక్ష ప్రదక్షణ చేసి, ధరించిన వస్త్రాన్ని పారవేయుమని ఆదేశం ఇచ్చాడు గురుడు. నరహరి అలాగే చేశాడు. తన శ్వేత కుష్టు వదిలిపోయిందని ఆనందపడ్డాడు. ‘నీ మనోరధం నెరవేరిందా? శరీరాన్నంత గోధించుకుని చూడు అన్నాడు గురువ్ఞ. శరీరాన్ని చూచుకున్నాడు నరహరి. కాలిమడకలో మాత్రం అతిచిన్నగా వ్యాధి మిగిలి వ్ఞన్నది అని చెప్పాడు నరహరి. ‘నీవ్ఞ మానవ్ఞని వలన ఏమవ్ఞతుంది అనే సందేహంతో రావడం వలన అంత మాత్రం వ్యాధి నిలిచింది అన్నారు నృసింహసరస్వతి. అతని తప్పు అర్ధమయింది. సంశయం ఎంతటి వినాశకారో గ్రహించాడు. గురువ్ఞపై శ్రద్ధ, విశ్వాసం ఎక్కువయ్యాయి. గురువ్ఞను నిండు మనసుతో స్తుతించాడు. వ్యాధి శేషం తొలగింది నరహరికి.

– యం.పి.సాయినాధ్‌