విశ్వసనీయత లేని వ్యక్తితో చర్చలా?

MP SUMAN
MP SUMAN

విశ్వసనీయత లేని వ్యక్తితో చర్చలా?

తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా విషయంలో అధికార, ప్రధానప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో రెండో రోజూ కరెంట్‌ మంటలు కొనసాగాయి. సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వంతో ఈ రంగంపై విస్తృత చర్చకు పునాది పడింది. మారిన పరిస్థితుల్లో విద్యుత్‌ దేశంలో తక్కువ ధరకు లభిస్తున్నది. కాగా గత పిపిఎల సంస్కృతి విద్యుత్‌ రంగంలో తీవ్ర ఆర్థిక భారానికి దారితీస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థలో మార్పు, చేర్పులు ఆహ్వానించదగినవే.

అయితే రాష్ట్రంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఈ రంగంపై చేసుకుంటున్న సవాళ్లు మరింత ఆసక్తికరంగా మారాయి. కాగా గురువారం నాడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ డిమాండ్‌ మేరకు తాము చర్చలకు సమయం, తేదీని ప్రకటించిన తర్వాత ఆపార్టీతోక ముడిచి పారిపోయిందని ఈ వివాదానికి కారణమైన ఎంఎల్‌ఎ రేవంత్‌ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కాదూ.. పార్టీ పిరాయింపు దారు,

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌కు విశ్వసనీయతలేదని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తం కాని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానా లేదా కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలి లేదా జీవన్‌ రెడ్డి వంటి నేతలు చర్చలకు వస్తే మాత్రమే తాము ఇందుకు సిద్ధమని టిఆర్‌ఎస్‌ నేతలు పల్లా, బాల్కాసుమన్‌ మరో వాదనను ముందుకు తెచ్చారు.

త్వరలో శాసనసభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఈ సందర్భంగా సభావేధికగా అన్ని విషయాలు చర్చకు తీసుకు రావచ్చని, ప్రభుత్వం తరపున సమాధానాలు వస్తాయనే అధికార పక్షం వెల్లడిస్తున్నది. హైదరాబాద్‌, జనవరి 11 ప్రభాతవార్త: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీలు విద్యుత్‌పై బహిరంగ చర్చకు వస్తే తాము సిద్దమని.. విశ్వసనీయత, నీతి నిజాయితీ లేని రేవంత్‌రెడ్డితో తాము చర్చించడానికి సిద్ధంగా లేమని టిఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో బుధ వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన శాసనమండలి ప్రభుత్వ విప్‌ డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మె ల్సీ భానుప్రసాద్‌లతో కల్సి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉంటడో, ఉండడో తెలియని సంపత్‌కుమార్‌, నిన్నటి వరకూ టిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దాసోజు శ్రవణ్‌లతో బహిరంగ చర్చకు వస్తానంటే కుదరదన్నా రు.