విశ్వమతాల్లో దేవ్‌బంది మతం ఒకటి

                     విశ్వమతాల్లో దేవ్‌బంది మతం  ఒకటి

devbandi
devbandi

విశ్వమతాల్లో దేవ్‌బంది మతం ఒకటి. ఈ మతం సున్నీ మతం నుంచి ఆవిర్భవించింది. ఉత్తర భారతదేశంలో 1866, మేనెల 30వ తేదీన ఏర్పడింది. ‘దరుల్‌ఉలూమ్‌ దేవ్‌బంది అనే పదం నుంచి ఉద్భ వించడం వల్ల ‘దేవ్‌బందిగా ఈ మతం పిలువబడుతున్నది. మహ మ్మద్‌ ఖాసి నానొత్వి, మహమ్మద్‌ యాకుబ్‌ నన్వాటవి, జుల్ఫికర్‌ ఆలీ, ఫాదయ్‌ అలీ రెహ్మాన్‌ మొదలైన విద్యావేత్తలు ఈ మత ఆవిర్బా ´వానికి కారకుల య్యారు. అయితే 1926వ సంవత్సరంలో తబ్లి గాయ్‌ జామిత్‌ అనే వ్యక్తి దేవ్‌బంది మతానికి కొత్త ఆలోచనల్ని జోడించి, వాటిని దేవ్‌బంది అనే పేరుతో స్కూల్‌ను స్థాపించి, విశ్వ వ్యాప్తంగా ఈ మతం వ్యాప్తి చెందేందుకు కృషి చేశారు. దీంతో 1926వ సంవత్సరం తర్వాతే ఈ మతం వ్యాప్తి చెందినట్లుగా చరిత్ర వివరిస్తున్నది.

మత ఆవిర్భవం దేవ్‌బంది అనే మతం మనదేశంలోనే ప్రారం భించబడింది. సున్నీ ఇస్లాం మతం నుంచి డియో బంది మతం ఆరంభమైనా, దీని పుట్టుక వెనుక పలు అంశాలున్నాయి. ఇస్లాం సమాజంలో ముస్లిం సంప్ర దాయాలు, ఆచారాలకు భంగం కలుగుతున్నదని, ఇస్లాం ఉన్నత ఉద్దే శాలను నెరవెర్చలేక పోతున్నదనే భావన మతపెద్దల్లో ఉండేది. అంతే కాక పాశ్చాత్య సంస్కృతిని వంటపట్టించుకుని ఇస్లాం మతాలకు చెందిన ఆరాధనల్లో యాంత్రికత్వం చోటు చేసుకోవడం, మతపెద్దలు సైతం ఆ ప్రభావాలకు గురవ్ఞతున్నారనే భావనతో డియో బంది అనే మతాన్ని స్థాపించేందుకు దారితీసింది. ఇందులో భాగం గానే మదర్సా (మతపరమైన స్కూలు) ఏర్పడింది. ఈ స్కూలు 1867వ సంవత్సరంలో ఢిల్లీలో మొదటగా స్థాపించబడింది.దేవ్‌బంది మదర్సా అనేమతం ముస్లిం మతాలకు చెందినవే అయినా ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి.

హిందూ మతంలో సిక్కు మతం భాగస్వామి అయినా వారు హిందూవ్ఞలుకాక సిక్కులుగా పిలవబడుతున్నట్లుగా, రోమన్‌ క్యాథలిక్‌ నుంచి ప్రొటెస్టెంట్‌ భాగస్వామి అయి నా వారు క్యాథలిక్‌లుగా కాక ప్రొటెస్టెంట్లుగా ఏవిధం గా పిలువబడుతున్నారో అలాగే ఇస్లాం మతంలో దేవ్‌బంది భాగస్వామి అయినా ఇది ముస్లిం మతంగా కాక దేవ్‌బంది మతంగానే పిలుబడుతున్నది. ఈ మతం పై తాలిబన్‌ మత సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. వీరి పవిత్ర గ్రంథం ‘ఖురాన్‌. ముస్లిం మతస్తు ల్లాగానే వీరు అల్లాను విశ్వసిస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఈ మతస్తులు ప్రాథమిక విద్య హనిఫ్‌ను (మత పరమైన)ను అనుసరిస్తారు. మహిళలపై వివక్ష దేవ్‌బంది మతం మహిళలపై వివక్షతను చూపుతుంది. ఈ మతానికి సంబంధించిన స్త్రీలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో భాగస్వామిగా ఉంటే వారికి ఫత్వా(నోటీసు)ను జారీచేస్తారు. అలాగే వీరు ఎన్నికల్లో కూడా పాల్గొనేందుకు వీలు లేదు.

అలా పాల్గొంటే కూడా ఫత్వాను జారీ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీ, పురుషులు కలిసి పని చేయకూ డదు. స్త్రీలు తమ దేహానంతా వస్త్రాలతో కప్పుకోవాల్సిందేనని అంటా రు. ఇక ఆధునిక వస్త్రాల జోలికి వెళ్లకూడదు. ఈ మతానికి చెందిన దాదాపు 600 మసీదులున్నాయి. ఈ మతం భారతదేశంలో ఆవిర్భవించినా దీని ప్రభావం ప్రస్తుతం మనదేశంలో కంటే అఘ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, సౌదీఅరేబియా వంటి ముస్లిం దేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మహిళలపై వివక్షకు సౌదీఅరేబియా, ఆఫ్ఘనిస్థాన్‌ వంటి దేశాల్లో నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మతాన్ని అవలంభించేవారు ఇస్తాం రాడికల్స్‌గా 18వ శతా బ్దంలో పిలువబడేవారు. ఇస్లాం మతంలోని సంప్రదాయాలు, సంస్కృ తి విలువల్ని పెంచే ఉద్దేశంతో ఏర్పడిన దేవ్‌బంది మతం ఆ తర్వాతి కాలం మతచాంధస భావాలుపెరిగిపోయి, విపరీతపోకడలతో ప్రవర్తిం చడంతో మనదేశంలో ఈ మతానికి చెందిన వారి సంఖ్య పెరగక పోవడానికి కారణమైంది.