విశ్రాంతి కావాలనుకుంటే బ్రేక్‌ తీసుకోవచ్చు: కపిల్‌దేవ్‌

kapil dev
kapil dev

హైదరాబాద్‌: క్రికెటర్లు కావాలనుకుంటే ఆటనుంచి బ్రేక్‌ తీసుకోవచ్చని క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం క్రికెట్‌ ఎంతో ప్రొఫెషనలిజంతో కూడుకున్నదని ,ఆటగాళ్లు బ్రేక్‌ తీసుకుని విశ్రాంతి పొందవచ్చన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడి, బిజీ షెడ్యూలు కారణంగా వారికి విరామం అవసరం. అంతర్జాతీయ క్రికెటర్లు పరిణితితో ఉంటారని, ఆట నుంచి ఎపుడు బ్రేక్‌ తీసుకోవాలో వారికి తెలుసునని అన్నారు. నేటి క్రికెటర్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. వారికి విశ్రాంతి అవసరమనుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పటంలో తప్పులేదు. ప్రస్తుతం భారత జట్టు ఎంతో మెరుగ్గా ఆడుతుందని, గత 10-15 ఏళ్లలో మన జట్టు ఎన్నో విజయాలు సాధించడం గర్వకారణమని అన్నారు.