విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు

vizag steels
vizag steels

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) – యూజీసీ నెట్‌ 2018 స్కోరు ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలవారీ ఖాళీలు: హెచ్‌ఆర్‌ 8, మార్కెటింగ్‌ 6
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా (హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ ్క్ష ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ / లేబర్‌ వెల్ఫేర్‌ / సోషల్‌ వర్క్‌ / మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌) పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఇంటర్వ్యూ నాటికి సర్టిఫికెట్లు పొందగలిగేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2018 ఫిబ్రవరి 1 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: యూజీసీ నెట్‌ జూలై 2018 స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
శిక్షణ వ్యవధి: ఏడాది ఏ ప్రొబేషన్‌: ఏడాది
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 25
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 16
వెబ్‌సైట్‌: www.vizagsteel.com