విశాఖ‌లో ఆటా మెడిక‌ల్ క్యాంప్‌ స‌క్సెస్‌

medical camp conducted by ATA
medical camp conducted by ATA

విశాఖ‌ప‌ట్ట‌ణంః అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నంలో మెడికల్‌ క్యాంప్‌తో పాటు స్వచ్ఛందంగా సామాజిక సేవలు అందించింది. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్‌ హెల్త్‌ క్యాంప్‌ సక్సెస్‌ అయింది. 200 మందికి పైగా పేషెంట్లకు ట్రీట్‌ మెంట్‌ చేసి మెడిసిన్‌ అందజేశారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు వైద్యులు సూచించారు. కొందరు చిన్నారులకు ఆట వస్తువులు అందజేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. హెల్త్‌ క్యాంప్‌లో స్థానికులు అడిగిన సందేహాలు విని డాక్టర్లు పలు సూచనలు, సలహా లిచ్చారు. కాగా, ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడ్కల్‌లో మెడికల్‌ క్యాంప్‌నకు విశేష స్పందన వచ్చింది. అదే విధంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం చిన్న ఆముదాలపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆటా బృందం నిర్వహించిన విషయం తెలిసిందే.