విశాఖపట్నంలో డ్రగ్స్‌ స్వాధీనం

Drugs
Drugs (FILE)

విశాఖపట్నంలో డ్రగ్స్‌ స్వాధీనం 

విశాఖపట్నం:  హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ ఉదంతం మరువకముందే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరో డ్రగ్స్‌ వ్యవహారం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. కాగా ఈ రోజు విశాఖ నగర పరిధిలోగల ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ కలకలం సృష్టించాయి. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో డ్రగ్స్‌కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.