వివేకాకు చంద్ర‌బాబు నివాళి

AP CM BABU
AP CM BABU

నెల్లూరుః టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం వివేకా సోదరుడు రాంనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సాయంత్రం వివేకా అంతిమ యాత్ర జరగనుంది. పెన్నానది తీరంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. మరోవైపు, వివేకాను తుదిసారి చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో వివేకా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.