వివిధ విభాగాల అభిప్రాయాల సేకరణ

Venkaiah Naidu

Venkaiah Naidu

వివిధ విభాగాల అభిప్రాయాల సేకరణ

న్యూఢిల్లీ: ఎపి ప్రత్యేక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత వివిధవిభాగాల నుంచి అభిప్రాయాలు సేకరించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.. ఎపి ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలపటంతో మీడియాతో ఆయన మాట్లాడారు.. ఆర్థిక మంత్రి సూత్రప్రాయంగా ప్రకటించిన ప్రత్యేక సహాయానికి కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపిందన్నారు..చట్టబద్ధత కోసం సిఎం చంద్రబాబుతోపాటు మేం కూడ చాలా రోజుల నుంచి దృష్టిసారించామన్నారు.. ప్రధాని మోడీ, అమిత్‌ షా పలు సందర్భాల్లో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారన్నారు..