వివాదాలు వైషమ్యాలపై ఇరువురి భేటీ

MODI-XIJ
MODI-XIJ

బీజింగ్‌(చైనా): ప్రధానినరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు గ్జిజిన్‌పింగ్‌లు ఇరువురూ చైనాలోని వుహాన్‌ నగరంలో ఈనెల 27,28 తేదీల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టంచేసుకునేందుకు సదస్సు నిర్వహిస్తారని చైనా విదేశాంగమంత్రి వాంగ్‌యీ వెల్లడించారు. ప్రధాని చైనా పర్యటన షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనాలని ఆదేశ అధ్యక్షుడు గ్జీజిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు మాజరవుతున్నారు. ఇప్పటికే బీజింగ్‌లో విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్‌ ఆ దేశ విదేశాంగమంత్రి వాంగ్‌యీతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. చైనామధ్యప్రాంత నగరంలో మోడీ పర్యటిస్తున్నారు. ఎనిమిది దేశాల ఎస్‌సిఒ సదస్సులో విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సుష్మ చైనా విదేశాంగమంత్రితో విస్తృత స్థాయి చర్చలుజరిపారు. అయితేమోడీ గ్జీ మద్యజరిగే సమావేశం ప్రాథమిక స్థాయి సమావేశం మాత్రమేనని అధికార వర్గాలు చెపుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శిఖరాలకు చేరుకునేదిశగా ఇరుదేశాల అత్యున్నతస్థాయి ప్రముఖులమధ్య సమావేశం జరుగుతున్నట్లు అధికారులు చెపుతున్నారు. అంతేకాకుండా ఇరుదేశాలమధ్య నెలకొన్న వివాదాలు, అభిప్రాయబేధాలనుసైతం ఈ సందర్భంగా ఈ సదస్సులోప్రస్తావించి పరిష్కరించుకోవాలని చెపుతున్నారు. 2014లో పాలనపగ్గాలుచేపట్టినతర్వాతమోడీ వరుసగా నాలుగోసారి చైనాలో పర్యటిస్తున్నారు తిరిగి జూన్‌ 9 నుంచి 10 తేదీలమధ్య చైనాలోని క్వింగ్‌డావ్‌ నగరంలోజరిగే ఎస్‌సిఒ సదస్సులో పాల్గొనేందుకు వస్తారని అంచనా. మోడీ, గ్జీ సదస్సు ఇటీవలికాలంలో రెండుదేశాల అత్యున్నతస్థాయి ప్రతినిధులమధ్య జరిగే సదస్సుగా చెపుతున్నారు. డోక్లామ్‌ ప్రతిష్టంభన జరిగిన తర్వాత గత డిసెంబరులో చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ భారత్‌లోపర్యటించారు. తదనంతరం ఇరుదేశాల జాతీయభద్రతాసలహాదారులసమావేశం జరిగింది. చైనావైపునుంచి యాంగ్‌ జైయిచీ, ఈ ఏడాదిప్రారంభంలోనే విదేశాంగశాఖ కార్యదర్శి విజ§్‌ు గోఖ్లే చైనాపర్యటన వంటివి చర్చల పునరుద్ధరణకు దారితీసినట్లు పరిశీలకులు చెపుతున్నారు రెండు దేశాలప్రతినిధులు మొత్తం 11వ ఆర్ధికగ్రూప్‌ సమావేశం, ఐదో వ్యూహాత్మక ఆర్ధికపరమైన చర్చల సమావేశం బీజింగ్‌లోనిర్వహించారు. సమావేశాలతోపాటు రెండువైపులా విదేశాంగ మంత్రిత్వశాఖపరిధిలోని అధికారులు సరిహద్దు వ్యవహారాలు, సరిహద్దు జలాలు, అణునిరాయుధీకరణపై చర్చలు వంటివాటిపై విస్తృతస్థాయిలో జరిగాయి. అంతేకాకుండా అణుసరఫరాగ్రూప్‌ దేశాల్లో భారత్‌ ప్రవేశం వంటివి తాజాగా ఆదివారం స్వరాజ్‌, వాంగ్‌ మధ్యజరిగిన చర్చల్లో చోటుచేసుకున్నట్లు విదేశాంగ శాఖవెల్లడించింది. అలాగే రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కూడా ఈనెల 23వ తేదీ ఎస్‌సిఒ రక్షణమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నారు. చైనా రక్షణమంత్రి లెప్టినెంట్‌ జనరల్‌ వైఫెంఘీని కలుసుకుని చర్చలుజరుపుతారు. ప్రాంతీయసహకారం, పరస్పర భద్రత సహకారం, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు వంటి వాటిపైనే విదేశాంగ మంత్రుల సమావేశంజరిగిందని ఆశాఖ ట్వీట్‌చేసింది. షాంఘై సహకార సంస్థలో రక్షణ అత్యంత ప్రాధాన్యతాంశంగా నిలిచింది. వచ్చే ఎస్‌సిఒ సదస్సు మరికొన్ని కీలక అంశాలపై ఉంటుందని ప్రజలు చెపుతున్నారు. ఎస్‌సిఒను మరింతముందుకు తీసుకెళ్లేందుకు ఈచర్చలు దోహదంచేస్తాయని భారత్‌వైపునుంచి సుష్మస్వరాజ్‌ వెల్లడించారు.