వివాదాలకు దారితీస్తున్న టిటిడి విధానాలు

TTD
Tirumala Temple

వివాదాలకు దారితీస్తున్న టిటిడి విధానాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే రెండవ సంపన్నమైన ఆలయం. ఏటా 2,350కోట్ల బడ్జెట్‌తో టిటిడి తన కార్యకలాపాలను సాగిస్తున్నది. శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు సగటున 70,000మంది భక్తులు వస్తుం టారు.రద్దీ సమయంలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. వీరందరి తలనీలాలను తీయడానికి 250 మంది పర్మినెంట్‌ క్షురకు లు పనిచేస్తున్నారు. వీరితో పాటు 300 మంది బార్బర్స్‌ పనిచేస్తు న్నారు. వీరితోపాటు 900మంది శ్రీవారి సేవకులు పనిచేస్తున్నా రు. వీరందరూ పనిచేస్తున్నప్పటికి ఒక భక్తుడు గుండు కొట్టుకో వాలంటే సాధారణ రద్దీ సమయంలో రెండు గంటల సమయం పడుతోంది.

దీన్ని అరగంటకు కుదించడానికి టిటిడి కసరత్తు చేస్తోం ది. ఇందులో భాగంగానే శ్రీవారి సేవకులను గుండు కొట్టేందుకు టిటిడి తీసుకుంది. టిటిడిలో 9000 మంది పర్మినెంట్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా పారిశుద్ద్యంలోను, కాటేజీల్లోను, గార్డెన్‌, వాటర్‌వర్క్స్‌, ఇంజనీరింగ్‌ విభగాల్లో పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగంలో సుమారు 6000మంది కార్మికులు పనిచేస్తున్నారు. పారి శుద్ధ విభాగంలో బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేస్తున్నవారంతా దళితు లే. మిగిలిన విభాగాలలో శ్రీవారి సేవకులు పనిచేయాలన్నా వారికి ఆయా విభాగాల్లో పనిచేయడానికి కొంత నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యం తెలిసిన శ్రీవారిసేవకులు సేవకు రావడంలేదు.

ఆ క్రమం లోనే పరకామణిలోకి బ్యాంకుసిబ్బందిని సేవకు వినియోగిస్తున్నా రు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. అదేవిధంగా లడ్డూ కౌంటర్లలోను శ్రీవారిసేవకులను వినియోగించుకోవాలని టిటిడి భావిస్తోంది. టిటి డిలో 15రోజుల పాటు ఉచితంగా సేవలు అందించడానికి 3 లక్షల మంది సేవకులు సిద్ధంగా ఉన్నారని టిటిడి ఇటీవల ప్రకటించింది. టిటిడిల్లోని ఇతర విభాగాల్లో ముఖ్యంగా పరకామణి, అన్నదా నం, క్యూలైన్ల క్రమబద్ధ్దీకరణ, సేవా విభాగాల్లో శ్రీవారి సేవకులను ఉపయోగించుకుంటున్నారు.రోజుకు సుమారు3000మంది శ్రీవారి సేవకులు రెండు తెలుగు రాZషాల నలుమూలల నుండి తిరుమలకు వస్తున్నారు.

వీరి సేవల వల్లే భక్తులకు ఇబ్బందిలేకుండా అన్ని సౌక ర్యాలు టిటిడి కల్సించగలుగుతోంది. అయితే కళ్యాణకట్టలో సైతం శ్రీవారి సేవకులు 900మంది పనిచేస్తున్నారు.వీరంతాఒక్క రూపా యి జీతంగా తీసుకోకుండా పనిచేస్తున్నారు.వీరి సేవలను రద్దీ సమ యాల్లోఉపయోగించుకుంటున్నారు.టిటిడిఉద్యోగులఖాళీలు 3500 కు పైగా వ్ఞన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంలేదు. కళ్యాణకట్టలో ఒక్క రూపాయి జీతం లేకుండా 900 మంద శ్రీవారి సేవకులు నెలల తరబడి ఎలా పనిచేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది.శ్రీవారి సేవ 15రోజులకి మించివ్ఞండదు.

మిగి లిన విభాగాల్లో ఇదే జరుగుతుంది. కళ్యాణకట్టలోని శ్రీవారి సేవకులకు భక్తులు తమ ఇష్టంతో ఇచ్చేనగదే వారికి జీవనభృతిగా ఉపయోగప డుతోంది. కాబట్టే శ్రీవారి క్షురకులు కళ్యాణకట్టలో ఉచి తంగాసేవ లు అందిస్తున్నారు.డయిల్‌ ఈవో కార్యక్రమంలో భక్తులు తరుచుగా కళ్యాణకట్టలో భక్తులదగ్గర బలవంతంగా క్షురకులు డబ్బులు వసూ లు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కళ్యాణ కట్టలో పీస్‌రేట్‌ క్షురకులుగా పనిచేస్తున్న 300 మందిని టిటిడేే తీసివేసిం ది. వీరు తమను టిటిడిలో కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నా రు. కఠ్యాణకట్టనే ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడానికి టిటిడే ప్రయ త్నాలుచేస్తోందని వామపక్షపార్టీలు ఆందోళనను ఉధృతం చేస్తున్నా యి.

కళ్యాణకట్టలో నిజంగా అవినీతి రాజ్యమేలుతుంటే ప్రక్షాళన చేయాల్సిన అవసర ముంది. అలాకాకుండా కళ్యాణకట్టనే ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టాలను కోవడాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్ప టికే టిటిడి కళ్యాణ మండ పాలను, కంప్యూటర్‌ దర్శన టోకెన్లు ఇచ్చే పనిని ప్రైవేట్‌సంస్థలకు అప్పగించేసింది.కళ్యాణకట్టలో అవి నీతికి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, క్షురకులు కారణంకావచ్చు. అందరూ కాదనే విషయం టిటిడికు తెలుసు.

అలాంటప్పుడు పీస్‌ రేట్‌ క్షురకులనే తితిదే ఎందుకు తీసివేసిందనే ప్రశ్నకు టిటిడి దగ్గర సమాధానం లేదు. కార్మికులు నానాఇబ్బందులు పడుతుంటే, కార్మి కులను సప్ల§్‌ు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలు మాత్రం పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నాయి. టిటిడిలో తత్సంబంధిత విభాగాల్లో పని చేయాల్సిన కార్మికులసంఖ్య కన్నా తక్కువగా కార్మికులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్మికుల నెత్తిమీద మొత్తం పనిభారం పడుతోంది. మిగిలిన కార్మికుల జీతభత్యాలను సదరు కాంట్రాక్టు సంస్థే నొక్కే స్తుందనే ఆరోపణలున్నాయి.

ఎఫ్‌ఎంఎస్‌ (ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌)కు కార్మికులను సరఫరా చేసే బాధ్యతను అధికార పార్టీకి చెందిన ఒక ప్రైవేట్‌ సంస్థ చేజిక్కించుకుంది. ఇటీవలే పుట్టిన ఈ సంస్థ తిరుపతి,తిరుమలలోని అత్యధిక తితిదే విభాగాల్లోని కాంట్రా క్టుల ను చేజిక్కించుకుంటోంది. సదరు సంస్థకే కళ్యాణకట్టలో భక్తులకు గుండు కొట్టేపనిని అప్పగించేందుకు ప్రభుత్వం పావ్ఞలు కదుపుతోం దనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 900 మంది శ్రీవారి సేవకుల సేవలను నిలిపివేసి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే, ఈ ఒక్కవిభా గం ద్వారానే సదరుసంస్థకు ఏటా 15కోట్లు వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి సేవపేరుతో గత నాలుగు సంవత్సరాలుగా 900మంది క్షురకులు ఉచితంగా భక్తులకు తలనీలాలను తీస్తున్నా రు. వీరి సేవలను హర్షించవలసిం దే.

గతంలో వీరికి కూడా ఒక గుండుకు రూ. 7 చొప్పున ఇచ్చేవా రు. తాజాగా దీన్ని రూ. 11కు పెంచారు. రోజుకు 20 వేల నుండి 30వేల వరకు భక్తులు తలనీ లాలను తిరుమలలో సమర్పించుకుం టారు.అంటే ఒక్క రోజుకే మూడులక్షల రూపాయలు ప్రైవేట్‌ సంస్థకు దక్కబోతోంది. రిలయ న్స్‌ కంపెనీ మాదిరి తితిదే మీద ఒత్తిడి తెచ్చి భవిష్యత్తులో పీస్‌రేట్‌ ను మరింత పెంచుకోవచ్చు. శ్రీవారి సేవకులను తితిదే ఇంకా తీసెయ్యలేదు. ప్రస్తుతం పీస్‌రేట్‌ క్షురకులనే తితిదే తీసివేసింది. టిటిడి విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులుసుమారు 13 సంవత్స రాలుగా పనిచేస్తున్నారు.అయినా వారి జీతాలు ప్రభుత్వ జీవో ప్రకా రం ఉండటం లేదు. దీనివల్ల ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. టిటిడి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తో ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల జీతభత్యాల్లో హెచ్చతగ్గులు ఉన్నాయి.

ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చాలా తక్కువగా ఉన్నా యి. రవాణా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సొసైటీల ద్వారా వేతనాల చెల్లింపు జరుగుతోంది. డ్రైవర్లుగా పనిచేస్తున్న కార్మికులకు నెలకు 25వేల రూపాయల వేతనాన్ని ఇస్తున్నారు. అదే కాంట్రాక్టు అధ్యాపకులకు నెలకు రూ.18వేల జీతం ఇస్తున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు పురాణపండితులకు నెలకు 17వేలు ఇస్తున్నారు. ఇదే విభాగంలో పనిచేస్తున్న ప్రోగ్రామ్‌ అసిస్టెంట్లకు రూ.18వేలు నెలకు వేతనంగా ఇస్తున్నారు.

కంప్యూటర్‌ ఆపరేటర్లు సొసైటీల ద్వారానే పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.11 వేలు వేతనం ఇస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేస్తూ అవ్ఞట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల్లో మూడు రకాల కేటగిరిలను రూపొందించింది. ఇందులో అన్‌స్కిల్డ్‌ కార్మికులకు నెలకు రూ.8100 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పింది. మరో జీవోలో కనీస వేతనం నెలకు 11 వేలకు తగ్గకూడదని ప్రభుత్వం చెప్పింది.ఈ భిన్నమైన ఉత్తర్వుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిటిడి లాంటి సంస్థలు తమ ఇష్టానుసారం కార్మికులకు జీతభత్యాలు ఇస్తున్నాయి.

ఇది పనిచేస్తున్న కార్మికుల్లో ఘర్షణలను రేపుతోంది. టిటిడిలోని 11వేల మంది కార్మికుల్లో 10 శాతం మందికి కూడా కనీస వేతనాలు అందడంలేదని వామపక్ష ట్రేడ్‌ యూనియన్లు ఆరో పిస్తున్నాయి.కార్మిక చట్టాలప్రకారం వీరికివేతనాలు అందడం లేదు. టిటిడిలోని ముఖ్యమైన 23 విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ఒకే విధమైన వేతన సవరణ ఉండాల్సి ఉంది. కన్సాలిడేటెడ్‌ పే ద్వారా కొంత మంది కార్మికుల కు ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇది వేతనం తక్కువ పొందుతు న్న కార్మికు లకు మానసిక క్షోభకు గురిచేస్తోంది. క్షురకులను తీసి వేయడంపై రాష్ట్రంలోని బిసిసంఘాలు భగ్గుమన్నాయి. క్షురకు లను మూకుమ్మ డిగా తొలగించడంపట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కు సకల సౌకర్యాలను కల్పించవలసిన టిటిడిపై ప్రభుత్వ పెత్తనం ఎక్కువ అవడం వల్ల టిటిడిదే డబ్బు పక్కదారి పడుతోంది.

– ఎం.కె.కుమార్‌