విలువైన సలహాల కోసమే సలహా మండలి : పవన్ కల్యాణ్

pavan kalyan
pavan kalyan

అమరావతి : నేడు   పవన్ కల్యాణ్   జనసేన పార్టీ సలహా మండలిని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ సలహా మండలి విలువైన సలహాల కోసమేనని, రాజకీయాల కోసం కాదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సలహా మండలి చైర్మన్‌గా విష్ణురాజును, సభ్యులుగా పొన్ను రాజ్, సుధాకర్‌ను నియమించారు. ఈ సందర్భంగా పవన్ ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. యువతకు పాతిక కేజీల బియ్యంతో సరిపెట్టకుండా.. పాతికేళ్ల బంగారు భవిష్యత్తును అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా మంది మేధావుల సలహాలు ఆవశ్యకమని.  అందుకే సలహా మండలిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనిలో రాజకీయాలకు తావు లేదని పవన్ స్పష్టం చేశారు.